Featured

Apple, Google Employees Angry Over Return To Office | యాపిల్ సంస్థపై 76 శాతం ఉద్యోగులు అసంతృప్తి



Published
కరోనా విజృంభణ తర్వాత ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో
.......యాపిల్ , గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు.....ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని భావిస్తున్నాయి. అందుకు వారు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ విషయమై సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ బ్లైండ్...గతనెల 13 నుంచి 19 మధ్య 652మంది యాపిల్ ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించింది. తిరిగి కార్యాలయాల నుంచే పనిచేయించాలన్న యాపిల్ సంస్థ
తీరుపై 76 శాతం మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంతా వారంలో ఒకరోజే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 23నుంచి వారంలో కనీసం 3రోజులు హాజరుకావాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉద్యోగులకు సూచించారు. ఈ నిర్ణయంపై అధికసంఖ్యలో ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది. వారంతా సంస్థను వీడి, కార్యాలయాలకు వచ్చే విషయంలో వెసులుబాటు కల్పించే సంస్థల్లో చేరాలని యోచిస్తున్నట్లు గుర్తించింది. మరో టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులను రప్పించేందుకు
ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం రైడ్ స్కూట్ ప్రొగ్రాంను ప్రారంభించింది. కరోనా సమయంలో ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయించిన సంస్థలకు..... వారిని కార్యాలయాలకు రప్పించడం ఇబ్బందిగా మారినట్లు కనిపిస్తోంది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Job
Be the first to comment