రాష్ట్రంలోని ప్రతి జిల్లాకొక విమానాశ్రయం! | CM Jagan Reviews Ports & AirportsPublished
ప్రతి జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని...... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్ష నిర్వహించిన C.M.....వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎయిర్ పోర్ట్ ఉండేలా ప్రణాళిక ఉండాలని సూచించారు.
ఈ మేరకు జిల్లాల్లో ఇప్పటికే చేపట్టిన విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్దపెట్టాలని నిర్దేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. బోయింగ్ విమానాలు ల్యాండింగ్ అయ్యేలా రన్ వే అభివృద్ధి చేయాలన్నారు. సీపోర్టులపైన అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మించాలని... పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. తొలిదశలో తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్భర్ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో చేపడుతున్న మిగిలిన 5 హార్బర్ల నిర్మాణాన్ని నిర్దిష్ట కాలపరిమితిలోగా నిర్మిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ 5 ఫిషింగ్ హార్భర్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామన్నారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Category
Job
Be the first to comment